Sun Dec 22 2024 01:36:05 GMT+0000 (Coordinated Universal Time)
Perni Nani : పేర్ని నాని కుటుంబీకులకు లుకౌట్ నోటీసులు
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబ సభ్యులు విదేశాలకు పారిపోకుండా పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. రేషన్ బియ్యం తమ గోదాము నుంచి తతక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులపై ఇప్పటికే కేసు నమోదు అయింది. అయితే గత కొద్ది రోజులుగా పేర్ని నాని కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే తాజాగా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
ఈ నెల 19వ తేదీకి...
హైకోర్టు వీరి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు విదేశాలకు పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. మచిలీపట్నంలోని పేర్ని నాని భార్య జయప్రద పేరిట ఉన్న గోదాములో ఉన్న పౌర సరఫరాల శాఖకు చెందిన బియ్యం మాయమైందని కేసు నమోదయింది. దీనిపై పలువురిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి కోటి రూపాయలు ప్రభుత్వానికి కూడా నాని కుటుంబ సభ్యులు చెల్లించారు. అయితే కేసు ఇంకా కొనసాగుతుండటం, అరెస్ట్ చేస్తారన్న భయంతో విదేశాలకు పారిపోయే అవకాశముందని లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు.
Next Story