Mon Dec 23 2024 12:43:25 GMT+0000 (Coordinated Universal Time)
Attack On Ys Jagan : జగన్ పై దాడి కేసులో పురోగతి.. యువకుడి గుర్తింపు?
విజయవాడలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది
విజయవాడలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై రాయి దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేకంగా స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సిట్ టీం అక్కడ పరిస్థితులను పరిశీలించి ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. సీసీ టీవీ ఫుటేజీతో పాటు లోకల్ గా సెల్ఫోన్లలో చిత్రీకరించిన వీడియాల ఆధారంగా ఈ ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
రాయి విసిరిన వారిని..
ఆ ఐదుగురిలో ఒకరు రాయి విసిరినట్లు పోలీసులు కనుగొన్నారని తెలిసింది. అయితే ఆ యువకుడు సింగ్ నగర్ కు చెందిన వాడిగా చెబుతున్నారు. కానీ ఆ యవకుడు ఎందుకు రాయి విసిరింది? ఎవరి ప్రమేయం ఉందా? అన్న దానిపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. నేడో, రేపో ఆ యువకుడిని మీడియా ఎదుట ప్రవేశ పెట్టే అవకాశముంది. ఆ యువకుడు ఎవరు? ఎందుకు ఈ దాడికి పాల్పడ్డారన్న దానిపై కారణాలను కనుగొనేందుకు సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
Next Story