Sun Dec 22 2024 23:00:25 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు.. బాధితుడికి నిమ్మగడ్డ పరామర్శ
పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు
పోలింగ్ కేంద్రంలో ఓటరుపై దాడికి పాల్పడిన అన్నాబత్తుని శివకుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు తనపై పోలింగ్ కేంద్రంలో దాడికి పాల్పడ్డారంటూ గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేపైన ఆయన అనుచరులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. తనకు తన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
క్యూ లైన్ లో రమ్మని అన్నందుకే...
తాను క్యూ లైన్ లో రమ్మని కోరినందుకు తనపై దాడికి తెగబడ్డారంటూ ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గొట్టిముక్కల సుధాకరన్ ను నిమ్మగడ్డ రమేష్ బాబు పరామర్శించి ఏం జరిగిందన్న దానిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story