Mon Dec 23 2024 00:42:58 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి దేవినేనిపై కేసు నమోదు
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పై పోలీసులు కేసు నమోదు చేశారు. కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆయన నిబంధనలను ఉల్లంఘించారని ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం జరిగిన కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా దేవినేని ఉమ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకున్నారు.
నిబంధనలను ఉల్లంఘించినందుకు....
దీంతో దేవినేని ఉమకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు మరికొందరు టీడీపీ నేతలపై పోలీసుల విధులకు ఆటంకం కల్గిస్తున్నారన్న కారణం, 144 సెక్షన్ ను ఉల్లంఘించి ర్యాలీని నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు.
- Tags
- devineni uma
- case
Next Story