Mon Dec 23 2024 03:12:56 GMT+0000 (Coordinated Universal Time)
Tadipathri : జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. అందువల్లనేనట
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న తాడిపత్రిలో ఫ్లెక్సీల ఏర్పాటు చేసిన సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలను తొలగించాలంటూ ఆయన రోడ్డుపై బైఠాయించారు. ఆందోళనకు దిగారు. పోలీసుల విధులను కూడా అడ్డుకన్నారు.
పోలీస్ యాక్ట్ను...
దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నప్పటికీ జేసీ ప్రభాకర్ రెడ్డి దానిని ఉల్లంఘించారని, రోడ్డుపై బైఠాయించి ప్రజలకు ఇబ్బంది కలగచేశారని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Next Story