Mon Dec 23 2024 09:06:49 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడుపై కేసు నమోదు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై పోలీసులు కేసు నమోదు చేశారు. కుప్పం పోలీసులు ఆయన పై కేసు నమోదు చేశారు. నిన్న నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా కుప్పంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సభకు హాజరైన అచ్చెన్నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు...
ప్రభుత్వంపైనా, వ్యక్తిగత విమర్శలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసినట్లు కుప్పం పోలీసులు తెలిపారు. పాదయాత్ర షరతులను ఉల్లంఘించి నిబంధనలను బేఖాతరు చేస్తూ అచ్చెన్నాయుడు చేసిన ప్రసంగంపైనే పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
Next Story