Mon Dec 23 2024 08:09:04 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రి అనుచరులపై కేసు నమోదు
కోనసీమ అల్లర్ల కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు చేశారు.
కోనసీమ అల్లర్ల కేసులో వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులపై కేసు నమోదు చేశారు. మంత్రి విశ్వరూప్ అనుచరులైన సత్యరుషి, సుభాష్, మురళీకృష్ణ, రఘులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కేసులో నిందితుడు సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూలంతో వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
కోనసీమ అల్లర్లు....
కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టినందుకు గత 24న అమలాపురంలో పెద్దయెత్తున అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని దుండగులు దగ్దం చేశారు. దీనిపై విచారిస్తున్న పోలీసులు ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా మంత్రి విశ్వరూప్ అనుచరులు నలుగురిపై కేసు నమోదు చేశారు.
Next Story