Thu Apr 03 2025 00:22:28 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమలలో డ్రోన్ : ఒకరిపై కేసు
తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కదలికల వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు

తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కదలికల వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ పై ఐపీసీ 447 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. డ్రోన్ కెమెరాతో కిరణ్ శ్రీవారి ఆలయ దృశ్యాలను చిత్రీకరించినట్లు కేసు నమోదయిందని తెలిిపారు.
కిరణ్ అనే వ్యక్తిని...
ఈ వీడియో గృహ శ్రీనివాస, ఐకాన్ ఫ్యాక్ట్ అకౌంట్ లో పోస్ట్ అయినట్లు గుర్తించిన పోలీసులు ఆ దిశగా విచారించి హైదరాబాద్ కు చెందిన కిరణ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దేవాలయం భద్రత ఉల్లంఘన, అసాంఘిక శక్తుల ప్రయోజనం చేకూర్చేలా వ్యవహరించినందుకు కిరణ్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story