Sat Apr 12 2025 08:07:46 GMT+0000 (Coordinated Universal Time)
సోము అల్లుడిపై కేసు నమోదు
ఏపీ భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసును పోలీసులు నమోదు చేశారు.

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసును పోలీసులు నమోదు చేశారు. సోము వీర్రాజు అల్లుడు కవల వెంకట నరసింహం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియలో రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పేరిట రుణం తీసుకున్నారు. జయరామకృష్ణ సంతకాలను ఫోర్జరీ చేసి ఈ రుణం తీసుకున్నారు.
చీటింగ్, ఫోర్జరీ కేసులు....
జయరామకృష్ణ ఫిర్యాదు మేరకు సోము వీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై పోలీసులు ఛీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు. ఆయనపై 406, 419, 420, 465 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.
Next Story