Mon Dec 23 2024 18:17:09 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోక్సో కేసు
వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు పోక్సో కేసు నమోదయింది.మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు
వైసీపీ ఎమ్మెల్యేపై పోలీసులు పోక్సో కేసు నమోదయింది. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై పోక్సో కేసు నమోదయిందని అధికారులు తెలిపారు. కోడుమూరులో ఒక బాలికపై లైంగిక వేధింపులకు సుధాకర్ పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
బాలికపై లైంగిక వేధింపులు...
దీనిపై విచారించిన పోలీసులు కోడుమూరు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు సుధాకర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుధాకర్ గతంలో కోడుమూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story