Sun Dec 22 2024 13:51:31 GMT+0000 (Coordinated Universal Time)
Ongole : ఒంగోలులో గాలిలోకి కాల్పులు.. లాఠీ ఛార్జి.. తీరా చూస్తే?
ఒంగోలులో కౌంటింగ్ ముందు, తర్వాత ఘర్షణలు జరుగుతాయని పోలీసులు అప్రమత్తమయ్యారు
ఒంగోలులో కౌంటింగ్ ముందు, తర్వాత ఘర్షణలు జరుగుతాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే అల్లరి మూకలను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. లాఠీ ఛార్జి చేశారు. ఒంగోలులోని బస్టాండ్ రోడ్డులో కొద్ది సేపటి క్రితం మాక్ డ్రిల్ ను పోలీసులు నిర్వహించారు. కౌటింగ్ రోజు కాని, తర్వాత కానీ అల్లర్లు జరిగితే పరిస్థిితిని ఎలా అదుపులోకి చేయాలో పోలీసులు మాక్ డ్రిల్ చేశారు. చూసేవారికి నిజంగానే పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపినట్లు కనపడటంతో ప్రజలు ఒకింత భయభ్రాంతులకు గురయ్యారు.
కౌంటింగ్ రోజు...
అయితే ఒకవేళ ఎన్నికల కౌంటింగ్ రోజు కానీ, తర్వాత కానీ అల్లర్లు జరిగితే ఏం చేయాలన్న దానిపై పోలీసులు మాక్ డ్రిల్ ను నిర్వహించారు. అందులో భాగంగా పోలీసులే అల్లరి మూకల అవతారమెత్తారు. వారిపై పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. భాష్పవాయువును ప్రయోగించారు. వాటర్ క్యానన్ లతో అల్లరి మూకలను చెదరగొట్టారు. దీంతో ఈ ఘటన చూసిన వారు నిజమోమో అని తొలుత కంగారు పడ్డారు. తర్వాత అది పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులు ముందుగానే ప్రజల మధ్యలో ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించారు.
Next Story