Mon Dec 23 2024 12:45:26 GMT+0000 (Coordinated Universal Time)
అమరావతిలో టెన్షన్.. టెన్షన్
అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. హైఅలర్ట్ ప్రకటించారు
అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. హైఅలర్ట్ ప్రకటించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై వైసీపీ, టీడీపీ నేతలు ఒకరినొకరు సవాళ్లు విసురుకున్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య సవాళ్లు జరిగాయి. ఇద్దరు నేతుల నేడు అమరావతిలోని అమరలింగేశ్వర ఆలయం దగ్గర చర్చకు సిద్ధమ్యారు.
సవాళ్లు విసురుకోవడంతో...
దీంతో భక్తులకు ఆలవాలమైన ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. టీడీపీ నేతలకు 149 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈరోజు అమరావతి వెళ్లేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 200 మంది నేతలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. వారిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.
Next Story