Mon Dec 23 2024 11:13:31 GMT+0000 (Coordinated Universal Time)
Tdp : అయ్యన్న ఇంటికి పోలీసులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇంటికి పోలీసులు చేరుకున్నారు. నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని నల్లజర్ల పోలీసులు చెబుతున్నారు. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరని కుటుంబ సభ్యులు చెప్పడంతో పోలీసులు ఇంటి వద్దనే ఉండి ఆయన కోసం వేచి చూస్తున్నారు.
నోటీసులు ఇచ్చేందుకు...
ముఖ్యమంత్రి జగన్ ను దూషించిన కేసులో అయ్యన్నపాత్రుడిపై నల్లజర్లలో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి అయ్యన్న పాత్రుడిని విచారించాలని నిర్ణయించారు. అందుకోసం నోటీసులు జారీ చేసేందుకు వచ్చారు. అయ్యన్న పాత్రుడికి నోటీసుల ఇచ్చి వెళతామని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు వచ్చారని తెలిసి అయ్యన్న పాత్రుడి ఇంటివద్ద పెద్దయెత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story