Mon Dec 23 2024 06:56:15 GMT+0000 (Coordinated Universal Time)
హిందూపురంలో బాలకృష్ణను అడ్డుకున్న పోలీసులు.. పరిస్థితి ఉద్రిక్తం
బాలకృష్ణను పోలీసులు అడ్డుకోవడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలాసేపటి తర్వాత మొత్తం కాన్వాయ్ ని పంపకుండా..
హిందూపురం : హిందూపురంలో పర్యటిస్తున్న బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. హిందూపురం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మూడ్రోజుల క్రితం కొడికొండలో జరిగిన జాతరలో టిడిపి, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో టిడిపి కార్యకర్తలు గాయపడ్డారు. వారిని పరామర్శించేందుకు బాలకృష్ణ కొడికొండకు వెళ్తుండగా.. చిలమత్తూరు మండలం కొడికొండ వద్ద బాలకృష్ణ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
బాలకృష్ణను పోలీసులు అడ్డుకోవడంతో.. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చాలాసేపటి తర్వాత మొత్తం కాన్వాయ్ ని పంపకుండా.. బాలకృష్ణ వాహనాన్ని మాత్రమే పోలీసులు గ్రామంలోకి అనుమతించారు. బాలకృష్ణరాకతో కొడికొండకు టిడిపి కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ నేతలు గ్రామాల్లో కక్షలు రేపేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడికొండ జాతరలో టిడిపి కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని.. ఇంకోసారి టిడిపి కార్యకర్తల జోలికొస్తే ఊరుకోబోమన్నారు. మూడేళ్లలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని.. అంతా బాదుడే బాదుడని దుయ్యబట్టారు.
Next Story