Mon Dec 23 2024 13:10:28 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి నారాయణపై ఆరోపణలు.. ప్రియ భర్త ఇచ్చిన వివరణ ఇదే
తన భార్య పొంగూరు ప్రియా మానసిక అనారోగ్యం తో భాదపడుతున్నదని.. ఆమె మాటలు పట్టించుకోకూడదని
మాజీ మంత్రి నారాయణపై ఆయన తమ్ముడి భార్య సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే..! నారాయణ తమ్ముడి భార్య పొంగూరు ప్రియ తనను నారాయణ తీవ్రంగా హింసిస్తున్నారని.. అర్ధరాత్రి పూట నన్ను టార్చర్ పెడుతున్నారంటూ ఇన్‌స్ట్రాగామ్ వేదికగా ఇటీవల వీడియోను అప్లోడ్ చేశారు. మాజీ మంత్రి నారాయణ ఒక డేగలా తనపై కన్నేశాడంటూ ఆమె ఆరోపణలు చేశారు. డేగ.. ఒక పిట్టను ఎత్తుకెళ్లినట్టు నా పరిస్థితి మారింది. ఇంట్లో భార్య ఉండగానే నేను అన్నం తీసుకురాలేదని నారాయణ కొట్టారు. నన్ను టార్చర్ చేసేవాడని ప్రియా ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ హింస పెడుతున్నారంటూ ప్రియా పొంగూరు కన్నీటి పర్యంతమయ్యారు. గత ఎన్నికల్లో ప్రచారం చేయ్యాలని నారాయణ ఇబ్బంది పెట్టారని, తన ఫ్యామిలీని కూడా నారాయణ ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు తన మనసు అంగీకరించలేదని ఆమె అన్నారు.
తన భార్య పొంగూరు ప్రియా మానసిక అనారోగ్యం తో భాదపడుతున్నదని.. ఆమె మాటలు పట్టించుకోకూడదని మాజీ మంత్రి నారాయణ సోదరుడు పొంగూరు సుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు. మానసిక ఒత్తిడితోనే ఏవేవో వీడియోలు చేస్తోందని అన్నారు. ఆమె మా కుటుంబం పై మాట్లాడిన వీడియోలను ఎవ్వరూ పట్టించుకోవద్దని అన్నారు. ఒక వారం రోజులుగా నా భార్య ఇన్‌స్ట్రాగామ్ వేదికగా పోస్టు చేసిన వీడియోలు.. నాకూ, నా కుటుంబం పరువుకు భంగం కలిగించేదిగా ఉందని అన్నారు. 2017లోనే ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టామని అన్నారు. 2019 ఆమె స్వగ్రామంలో కూడా చికిత్స ఇప్పించామని అన్నారు. 2020 లో డాక్టర్ విరంచి దగ్గర కూడా చూపించామని.. అయినా కూడా ఆమె తీరులో మార్పు రాలేదని అన్నారు. పలు ట్రీట్మెంట్లకు సంబంధించిన రికార్డులను పొంగూరు సుబ్రహ్మణ్యం మీడియాకు చూపించారు. క్యాన్సర్ తో కూడా ఆమె బాధపుతోందని.. ఆమె మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉందని అన్నారు. ఆమె ఆరోగ్యం బాగా లేదని.. ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నామని అన్నారు. మా పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. ఆమె పెట్టే వీడియోలను పట్టించుకోవద్దని మనవి చేసుకుంటూ ఉన్నామన్నారు.
Next Story