Tue Dec 24 2024 03:00:47 GMT+0000 (Coordinated Universal Time)
పోసానికి కీలక పదవి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
గతవారమే హాస్యనటుడు అలీకి పదవినిచ్చిన విషయం తెలిసిందే. అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా..
ఏపీ ప్రభుత్వం మరో కీలక పదవిని భర్తీ చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. సినీ నటుడు, దర్శకుడు, కథా రచయిత అయిన పోసాని కృష్ణమురళికి కీలక పదవిని కట్టబెట్టింది. ఏపీ ఫిల్మ్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళిని నియమించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
గతవారమే హాస్యనటుడు అలీకి పదవినిచ్చిన విషయం తెలిసిందే. అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించింది. అలీ నియామకం జరిగిన రోజుల వ్యవధిలోనే పోసానికి కూడా కీలక పదవిని అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోసాని 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. అప్పటి నుండి ఆయన నిర్ణయాలను, ఆలోచనలను, వాదనలను సమర్థిస్తూ వచ్చారు పోసాని. ఏపీ మూడురాజధానుల అంశాన్ని సైతం పోసాని సపోర్ట్ చేశారు.
Next Story