Mon Dec 23 2024 09:01:33 GMT+0000 (Coordinated Universal Time)
ప్రొద్డుటూరులో సునీత పోస్టర్లు
కడప జిల్లా ప్రొద్డుటూరులో వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
కడప జిల్లా ప్రొద్డుటూరులో వైఎస్ వివేకా కుమార్తె సునీత పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సునీత రాజకీయ ప్రవేశం చేయబోతున్నారంటూ పోస్టర్లలో ముద్రించారు. పోస్టర్లలో సునీతతో పాటు ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి తదితరుల ఫొటోలు కూడా ఉన్నాయి. లోకేష్‌తో పాటు వైఎస్ వివేకానందరెడ్డి ఫోటోలను కూడా దీనిపై ముద్రించి ఉన్నారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ప్రొద్దుటూరు నగరంలో పలుచోట్ల అతికించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
బెంగళూరులో ....
సీసీ టీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ పోస్టర్లు బెంగళూరులోని ఒక ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించినట్లు స్పష్టమయిందని అధికారులు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది పోస్టర్లను తొలగిస్తున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ పోస్టర్లు కడప జిల్లాలో కొంత కలకలం రేపుతున్నాయి. అయితే ఎవరో కావాలనే సునీతపై కక్ష కట్టి ఈ పోస్టర్లను ముద్రించి అతికించి ఉంటారని చెబుతున్నారు. సునీతకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని, తన తండ్రి హత్యకు కారణమైన వారిని జైలుకు పంపడమే లక్ష్యంగా ఆమె పనిచేస్తున్నారని అంటున్నారు.
Next Story