Mon Dec 23 2024 07:01:25 GMT+0000 (Coordinated Universal Time)
మోదీ స్థానంలో నా మిత్రుడే పీఎం కావాలి: పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. వందలాది మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రధాని మోదీ బాధ్యత వహించాలని.. బాధ్యుడిగా ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధ్యులైన అధికారులందరిని విధుల నుంచి తొలగించాలన్నారు. రైల్వేశాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదని.. అన్ని శాఖలను మోడీ తన గ్రిప్లో పెట్టుకున్నారు కాబట్టే.. ఈ ఘటనకు కూడా ప్రధాని మోదీ బాధ్యుడని అన్నారు.
ప్రధాని మోదీ కాకుండా.. తన మిత్రుడు ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకూ ఆ మిత్రుడు ఎవరో తెలుసా..? అమిత్ షా అట..! అవును అమిత్ షా తన మిత్రుడని పాల్ చెప్పుకుంటూ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని నిన్ననే చెప్పానని అన్నారు. మోదీ స్థానంలో నా మిత్రుడు అమిత్ షాను ప్రధానమంత్రిని చేస్తే దేశం ఇంకా అద్భుతంగా ముందుకెళుతుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ దారుణంగా విఫలమయ్యారని కేఏ పాల్ విమర్శించారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ ఒక పెద్ద డ్రామా అని అన్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు కనీసం 50 సార్లు అపాయింట్ మెంట్ అడిగి ఉంటారని, కానీ తన మిత్రుడు అమిత్ షా ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని పాల్ తెలిపారు. చంద్రబాబుతో జాగ్రత్తగా ఉండాలని, అలాంటి ముప్పు తప్పించుకోవాలంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోవాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు.
Next Story