Mon Dec 23 2024 13:58:48 GMT+0000 (Coordinated Universal Time)
మమ్మల్ని ఆదుకోండి.... టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. ప్రకాశం జిల్లాను వెనకబడిన జిల్లాగా చేర్చాలంటూ వారు తమ లేఖలో కోరారు. జిల్లాలో కరువు పరిస్థితులు విపరతీంగా చోటు చేసుకున్నాయని, ప్రస్తుత ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని, ప్రజలను ఆదుకోవడం లేదని ఎమ్మెల్యేలు తమ లేఖలో పేర్కొన్నారు. కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్న ఈ జిల్లాకు ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని కోరారు.
వెనకబడిన జిల్లాగా....
తాగు, సాగునీరు అందక ప్రకాశం జిల్లాలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. సరైన రహదారుల సౌకర్యాన్ని కల్పించడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమయిందని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వైసీపీ పాలనలోని మూడేళ్లలో ఒక్క రూపాయి కూడా ఈ జిల్లాకు కేటాయించలేదని వారు రాసిన లేఖలో పేర్కొన్నారు. లేఖ రాసిన వారిలో ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, డోలా బాలాంజనేయస్వామి, ఏలూరు సాంబశివరావులు ఉన్నారు.
Next Story