Sun Apr 06 2025 09:14:59 GMT+0000 (Coordinated Universal Time)
యర్రగొండపాలెం రిటర్నింగ్ అధికారిపై వేటు
ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ సీఈసీ ఉత్తర్వులు జారీ చేశారు

ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీలేఖను తొలగిస్తూ సీఈసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఆమెను విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆమెను విధుల నుంచి తప్పిస్తున్నగ్లు తెలిపారు.
పోలింగ్ సందర్భంగా...
ఈనెల 13న జరిగిన పోలింగ్ సందర్భంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ తెలిపారు. గురువారం నియోజకవర్గానికి కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.
Next Story