Mon Dec 23 2024 15:57:13 GMT+0000 (Coordinated Universal Time)
అందరూ కలసి వస్తున్నారు.. సమ్మెకు సమాయత్తమవుతున్నాం
పీఆర్సీ సాధన సమితి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు వెళ్లాలని నిర్ణయించారు.
పీఆర్సీ సాధన సమితి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రభుత్వం తమ డిమాండ్లకు అంగీకరిస్తేనే చర్చలకు వెళ్లాలని నిర్ణయించారు. ఐఆర్ కు అనేక భాష్యాలు చెబుతున్నారని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపించారు. ఐఆర్ అంటే మధ్యంతర ఉపశమనం అని అన్నారు. అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్టు పొందడం తమ హక్కు అని వారు చెప్పారు. ఆర్టీసీ, విద్యుత్తు, ప్రజారోగ్యం, హైకోర్టు ఉద్యోగులు కూడా తమతో సమ్మెలో కలసి వస్తాయని వారు చెప్పారు.
పీఆర్సీతోనే అన్యాయం...
అధికారులకు ఉన్నంత తెలివితేటలు తమకు లేకపోయినా తమ జీతాలు మాత్రం తగ్గాయని చెప్పారు. ఆర్టీసీ, హైకోర్టు, విలేజ్ వార్డు సెక్రటేరియట్ లు కూడా తమతో కలసి సమ్మె లో పాల్గొంటాయని చెప్పారు. ప్రభుత్వం కమిషన్లతోనే కాలం గడుపుతుందని చెప్పారు. కొత్త పీఆర్సీతో తమకు అన్యాయం జరిగిందని చెప్పారు. తమకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని వారు చెప్పారు. తాము ఇప్పుడు 13 వేతన సవరణలో ఉండాల్సిందని, ఇప్పటికి 11 వ వేతన సవరణ వచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు సూర్యనారాయణ, బండి శ్రీనివాసరావు తెలిపారు.
Next Story