Mon Dec 23 2024 12:09:47 GMT+0000 (Coordinated Universal Time)
పీఆర్సీ సాధన సమితి అత్యవసర సమావేశం... హైకోర్టుకు
పీఆర్సీ సాధన సమితి అత్యవసరంగా సమావేశమయింది. రెవెన్యూ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో చర్చలు జరపుతున్నారు
పీఆర్సీ సాధన సమితి అత్యవసరంగా సమావేశమయింది. రెవెన్యూ భవన్ లో జరుగుతున్న ఈ సమావేశంలో చర్చలు జరపుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో సభ నిర్వహించాలని తొలుత అనుకున్నారు. అయితే సభ నిర్వహణకు పోలీసులు అనుమతి లేదని చెప్పారు. దీంతో సభను ఎక్కడ నిర్వహించాలన్న దానిపై చర్చించేందుకు సమావేశమయ్యారు.
చలో విజయవాడ కార్యక్రమంపై.....
రేపు ఉద్యోగ సంఘాలు చలో విజయవాడ కార్యక్రమానికి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. చలో విజయవాడ కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయాలి? బీఆర్టీఎస్ రోడ్డులో సభకు అనుమతిపై హైకోర్టును ఆశ్రయించాలా? అన్న దానిపై న్యాయ నిపుణులతో చర్చించారు. మంత్రుల కమిటీతో చర్చలు విఫలం కావడంతో చలో విజయవాడను లక్షలాది మందితో నిర్వహించాలని భావించారు. కానీ కోవిడ్ నిబంధనల మేరకు పోలీసులు అనుమతివ్వలేదు. దీనిపై చర్చిచేందుకు పీఆర్సీ సాధన సమితి అత్యవసర సమావేశం నిర్వహిస్తుంది.
Next Story