Mon Dec 23 2024 19:46:17 GMT+0000 (Coordinated Universal Time)
ఆదాయం తగ్గిందే
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కువ మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారని టీటీడీ అంచనా కార్యరూపం దాల్చడం లేదు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎక్కువ భక్తులు తిరుమలకు చేరుకుంటారని తిరుమల తిరుపతి దేవస్థానం వేసుకున్న అంచనా కార్యరూపం దాల్చడం లేదు. భక్తులతో అధిక రద్దీ ఉంటుందని భావించి తిరుమలకు భక్తులకు స్వల్పంగానే వస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడతాయి. గోవింద నామస్మరణలతో మారుమోగుతాయి. అయినా సరే గత రెండు రోజుల నుంచి తిరుమలకు భక్తుల రాక అంతగా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
భక్తుల సంఖ్య కూడా...
నేడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి కేవలం రెండు గంటల సమయం మాత్రమే పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కేవలం నాలుగు కంపార్ట్మెంట్లలోనే భక్తులు వేచి ఉన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 64,277 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 2.89 కోట్ల రూపాయలు మాత్రమే.
Next Story