Fri Jan 10 2025 18:58:24 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు
భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విజయవాడ రానున్నారు. ఇప్పటికే నేతలు గుర్తించిన మూడు స్థలాలను పరిశీలించి ఒకదానిని ఆయన ఖరారు చేయనున్నారు.
వచ్చే ఎన్నికలకు...
భారత రాష్ట్ర సమితి కార్యాలయాన్ని ఏపీలో ప్రారంభించి వచ్చే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగాజక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్డులో 800 గజాల స్థలంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నారు. మంత్రి తలసాని విజయవాడ పర్యటన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.
Next Story