Tue Dec 24 2024 02:53:54 GMT+0000 (Coordinated Universal Time)
వెంకట్రామిరెడ్డికి ఈ ఎన్నిక సవాలే
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి సవాల్ ఎదురుకానుంది
ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి సవాల్ ఎదురుకానుంది. ఈరోజు ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం తొమ్మిది పోస్టులకు ముప్ఫయి మంది పోటీ పడుతున్నారు. రెండు ప్యానెల్ లు ఈ పోటీలోకి దిగడంతో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పర్యాటక శాఖ సెక్షన్ ఆఫీసర్ రామకృష్ణ ప్యానెళ్లు విడివిడిగా పోటీ చేయడంతో పోటీ అనివార్యమయింది. గత ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
రెండు ప్యానెల్ లు...
కొన్ని డిమాండ్లను నెరవేర్చడంలో వెంకట్రామిరెడ్డి ఫెయిలయ్యారని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల ఇళ్ల స్థలాలను కేటాయించడంలో ఫెయిలయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరగనున్న ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డి ప్యానెల్ కు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నారు. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అనంతరం కౌంటింగ్ ప్రారంభమవుతుంది.
Next Story