మాజీ సీఎం చంద్రబాబు పై పాత కేసులు – వాటి వివరాలు
చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరపాలని వై రాజశేఖర రెడ్డి నుంచి ఆయన భార్య వై విజయ లక్ష్మీవరకు దాఖలు చేసిన పాత కేసులు 17 అనేక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి.
మాజీ సీఎం చంద్రబాబు పై పాత కేసులు – వాటి వివరాలు
చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరపాలని వై రాజశేఖర రెడ్డి నుంచి ఆయన భార్య వై విజయ లక్ష్మీవరకు దాఖలు చేసిన పాత కేసులు 17 అనేక కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ కోర్టు మెట్లు ఎక్కలేదు. అందుకే కాబోలు ఆయనను వ్యవస్థలను మేనేజ్ చేస్తారని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తారు. అప్పటి గవర్నర్ చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయడానికి నిరాకరించడంతో ఆయన మొదటి కేసును సుప్రీంకోర్టు పిటీషన్ ను డిస్మిస్ చేసింది. 1999 నుంచి 2005 వరకు ఇదే పరిస్థితి. ఇప్పటి వరకు మొత్తం 24 కేసులను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.
చంద్రబాబు అవినీతి, అక్రమార్జనలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1998,1999, 2000 ల్లో నమోదు చేయగా, గవర్నర్ ఆయనను ప్రాసిక్యూట్ చేయడానికి ఒప్పుకోలేదు. గవర్నర్ విచక్షణను ప్రశ్నించలేమని ఆ కేసులను సుప్రీంకోర్టు కేసులను డిస్ మిస్ చేసింది.
తెలుగుదేశం నాయకుడు ఎం లింగారెడ్డి చెప్పిన దాని ప్రకారం చంద్రబాబుపై 24 కేసులు హౌస్ కమిటీల దర్యాప్తుల్లో ఉన్నాయి. వైఎస్ జగన్ మరో 40 మంది పిటిషన్లు కూడా విచారణకు నోచుకోలేదు. చంద్రబాబుపై సాక్ష్యాధారాలు లేనందువల్ల 4 కేసులను వైఎస్సార్ తనంతట తానే విత్ డ్రా చేసుకున్నారు. కోర్టులు తరచుగా ప్రత్యర్థులకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినప్పటికీ పదే ..పదే కేసులు పెడుతున్నారు.
రాష్ట్రం కోసం కష్టపడి పనిచేయడాన్ని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని చంద్రబాబు చెబుతున్నారు. హై కోర్టు కొట్టేసిన కేసులపై ఏసీబీ కోర్టుకు వెళ్లడం దండగని అని పార్టీ నాయకులతో అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణ మాట్లాడుతూ తప్పు చేయకుంటే భయపడటం ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు. మళ్లీ స్టే తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
1999లో
చంద్రబాబు కుటుంబ ఆస్తులపై ఆర్థిక అత్యవసర పరిస్థితి (Financial Emergency), ఆస్తుల బదలాయింపు (Transfer of properties) అక్రమాస్తులు (disproportionate assets) వైఎస్ ఆర్ , షబ్బీర్ అలీ, ఎ. క్రిష్ణ, పురుషోత్తం రావు, నంది ఎల్లయ్య, పిట్ల క్రిష్ణలు సంయుక్తంగా పిటీషన్ ధాఖలు చేశారు.
చంద్రబాబు కుటుంబ ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని అదే ఏడాది వైఎస్ ఆర్, డీఎల్ రవీంద్ర రెడ్డి, ఎం పద్మనాభం, పీఆర్ రెడ్డి, పి సుధీర్ కుమార్,ఎన్వీ రామరాజు, దానం నాగేందర్, ఈరాసు ప్రతాప్ రెడ్డి,అంబటి సుబ్బారావు, ఎ. సాయిప్రతాప్, అరుణకుమారి, సురేష్ రెడ్డి,జీవన్ రెడ్డి, ఆనం వివేకారెడ్డిలు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు.
ఫలితం : ఆ పిటీషన్లన్నీ హైకోర్టులో ఉపసంహరించుకున్నారు.
2000లో
చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ ఫుడ్స్, దాని లావాదేవీలు, తప్పుడు స్టేట్ మెంట్లు, చంద్రబాబు భార్య భువనేశ్వరి కి చెందిన కార్బైడ్స్ , మిశ్రమ లోహాలు, విష్ణుప్రియ హార్టికల్చర్ లిమిటెడ్ పై సీబీ ఐ విచారణ జరపాలని వైఎస్ ఆర్ పిటిషన్ ధాఖలు చేశారు.
ఫలితం : ఈ కేసు ప్రజాప్రయోజనాల వాజ్యం పరిధిలోకి రాదని, ఆర్టికల్ 226ను అమలు చేయలేమని హైకోర్టు ఈ కేసులను డిస్ మిస్ చేసింది.
2001లో
సీఎం చంద్రబాబు ఆస్తులు, సంవత్సరాదాయం రూ.36 వేలు, ఎన్టీ ఆర్ ట్రస్ట్ కు భూకేటాయింపులపై వైఎస్ ఆర్ కేంద్ర విజిలెన్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఫలితం : పిటీషన్ ను ఢిల్లీ హైకోర్టులో విత్ డ్రా చేసుకున్నారు.
2003లో
కన్న లక్ష్మీనారాయణ చంద్రబాబు అక్రమాస్తులపై సీబీఐ ఎంక్వయిరీకి పిటీషన్ దాఖలు
ఫలితం : పిటీషన్ ను హైకోర్టులో విత్ డ్రా చేసుకున్నారు.
2004లో
పాల్వాయి గోవర్థన రెడ్డి ఐఎంజీ భారత్ కి అక్రమంగా భూములు కట్టపెట్టడంపై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కేసు ఫైలు
ఫలితం : ఏసీబీ కోర్టు క్విడ్ ప్రో కో జరిగిందని ఆధారాలు లేవని కేసు కొట్టివేసింది.
2005లో
లక్ష్మీపార్వతి చంద్రబాబు ఆస్తులపై ఏసీబీ విచారణ జరపాలని పిటిషన్ దాఖలు
ఫలితం : హైకోర్టు ఆ పిటిషన్ పై స్టే విధించింది.
2006లో
చంద్రబాబు ఆస్తులు, హెరిటేజ్, ఎన్టీ ఆర్ ట్రస్టులపై సీబీఐ విచారణ జరపాలని కన్నాలక్ష్మీనారాయణ పిటీషన్ దాఖలు చేశారు.
ఫలితం : 1999 ముందు కూడా ఇదే కేసును ఇదే లాయర్లు విచారణకు చేపట్టారని, ఎన్నికల ముందు ఈ పిటీషన్ ను వెనక్కు తీసుకొని 2004లో మళ్లీ ఫైల్ చేశారని, పిటీషన్ దారులు సరైన అధికారులను కలుసుకోలేదని పిటిషన్ తిరస్కరణ.
2005లో నే...
కె. శ్రీహరి,అశోక్ లు సోమశేఖర కమిషన్ ను పునరుద్దరించాలని కోరగా,
ఫలితం : జడ్జి వారిని కించపరిచారు. 2005 ప్రభుత్వానికి ఆ కమిషన్ ను పునరుద్దరించే అధికారం లేదని దీనిపై పునరాలోచన లేదని డివిజనల్ బెంచ్ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కె. హరిబాబు మాట్లాడుతూ తెలంగాణాలో జరిగిన కేష్ ఫర్ ఓట్ స్కాంలో చట్టం తన పని తాను చేసుకు పోతుందన్నారు.