Mon Dec 23 2024 17:02:01 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు షాక్.. టామాటా ధర ఇలానా?
టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దిగుబడి ఎక్కువ కావడంతో టమాటా ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదు
టమాటా ధర ఒక్కసారిగా పడిపోయింది. దిగుబడి ఎక్కువ కావడంతో టమాటా ధర రైతులకు గిట్టుబాటు కావడం లేదు. కనీసం తాము ఖర్చు చేసిన మొత్తం కూడా వెనక్కు రాకపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు. మదనపల్లె మర్కెట్ కు లోడ్ల కొద్దీ టమాటా రావడంతో కిలో ఐదు రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు. కొన్ని చోట్ల రైతులు టమాటాను మార్కెట్ కు తీసుకురావడం వృధా అని భావించి రోడ్లమీద పారబోస్తున్నారు.
కిలో ఐదు రూపాయలు...
ఇక కర్నూలు జిల్లాలో టమాటా ధర కిలో పది రూపాయల వరకూ పలుకుతుంది. రైతుల నుంచి ముప్ఫయి కేజీల బాక్సులను నలభై రూపాయలకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. వినియోగదారులకు చేరేసరికి కేజీ 20 రూపాయలు ఉన్నప్పటికీ రైతులకు మాత్రం కేజీకి పది రూపాయలు కూడా రావడం లేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
Next Story