Mon Dec 23 2024 17:35:45 GMT+0000 (Coordinated Universal Time)
పడిపోయిన టమాటా ధర.. ఎంతంటే?
పత్తికొండ మార్కెట్ లో టమాటా ధర పూర్తిగా పడిపోయింది. కిలో టమాటా ధర నాలుగు రూపాయలు పలుకుతుంది.
టమాటా ధర నిన్నటి వరకూ వినియోగదారులకు చుక్కలు చూపించింది. కిలో యాభై నుంచి అరవై రూపాయల వరకూ వ్యాపారులు బహిరంగ మార్కెట్ లో విక్రయించారు. ఇప్పుడిప్పుడే దిగి వచ్చింది. కిలో ముప్ఫయి రూపాయలకు పడిపోయింది. అయితే రైతుల విషయంలో మాత్రం టమాటా ధర దారుణంగా పడిపోయింది.
పత్తికొండ మార్కెట్ లో...
పత్తికొండ మార్కెట్ లో టమాటా ధర పూర్తిగా పడిపోయింది. కిలో టమాటా ధర నాలుగు రూపాయలు పలుకుతుంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఎదురు చూపులు చూస్తున్నారు. పంట దిగుబడి ఎక్కువ కావడంతో ధర పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మొత్తం మీద మరోసారి టమాటా రైతులు తామ పండించిన పంటకు సరైన ధర రాకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రోడ్ల మీద పోసి వెళుతున్నారు.
Next Story