Tue Mar 11 2025 06:50:40 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభలో రాష్ట్ర విభజనపై మోదీ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రధాని మోదీ అన్నారు.

రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ కు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీకి అన్యాయం చేసింది కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర విభజన సక్రమంగా ఉంటే ఇప్పుడు ఈ సమస్యలు వచ్చేవి కావని మోదీ అన్నారు. రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని మోదీ తెలిపారు. విభజన చేసిన కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కోల్పోయిందన్నారు.
ఏపీకి అన్యాయం....
ఏపీకి కాంగ్రెస్ మాత్రమే అన్యాయం చేసిందని తెలిపారు. కేంద్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ ఏపీకి అన్యాయం చేసిందన్నారు. అసలు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏపీ సహకరించిందని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని హడావిడిగా విభజించారన్నారు. వాజ్ పేయి హయాంలో రాష్ట్ర విభజన జరిగినా సమస్యలు రాలేదని మోదీ గుర్తు చేశారు. రాజ్యసభలో మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story