Mon Dec 23 2024 12:06:04 GMT+0000 (Coordinated Universal Time)
నూరుశాతం నిజం చెప్తున్నా
తాను నిజం చెప్పడానికే ఇక్కడకు వచ్చానని, కేసీఆర్ కూడా తాను ఎన్డీఏలో చేరతానని అడిగారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు
తాను నిజం చెప్పడానికే ఇక్కడకు వచ్చానని, కేసీఆర్ కూడా తాను ఎన్డీఏలో చేరతానని అడిగారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నిజామాబాద్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్తో కలసే ప్రసక్తి లేదని అన్నారు. ఈసారి ఎన్నికల్లో గెలిస్తే కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తారని చెప్పారు. కుటుంబ పార్టీలను తెలంగాణ ప్రజలు నమ్మవద్దని కోరారు. కర్ణాటక ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలని చూస్తుందని మోదీ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కూడా కేసీఆర్ తనను కోరారని తెలిపారు.
కేసీఆర్ ను కలుపుకోని పోం...
అయితే ఆ ఎన్నికల తర్వాత తెలంగాణలో సీన్ మారిపోయిందన్నారు. తనను ఎన్డీఏలో కలుపుకోవాలని కోరారని, అయితే తాను కుదరదని చెప్పానని మోదీ తెలిపారు. కేసీఆర్ అవినీతి బాగోతాన్ని బయట పెట్టడానికే తాను వచ్చానని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో తాము కలిసే ప్రసక్తి లేదని మోదీ చెప్పారు. ఎవరు అధికారంలో ఉండాలో ప్రజలే నిర్ణయించుకుంటారని మోదీ అన్నారు. తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను తానే ప్రారంభించానని చెప్పారు. ఎనిమిది వేల కోట్లకు పైగా పనులను ప్రారంభించానని తెలిపారు.
Next Story