Wed Mar 26 2025 03:09:05 GMT+0000 (Coordinated Universal Time)
Tirumala : శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని
తిరుమలలో శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు.

తిరుమలలో శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ప్రధాని ఈరోజు తిరుమలలో ఉండటం, శ్రీవారిని దర్శించుకోవడంతో ఉదయం బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ప్రధానికి రంగనాయకుల మండపం వద్ద ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.
మరికాసేపట్లో హైదరాబాద్కు...
ప్రధానికి చిత్రపటాన్ని, శ్రీవారి ప్రసాదాన్ని అందించారు. ప్రధాని నరేంద్రమోదీ దాదాపు యాభై నిమిషాలు ఆలయంలోనే గడిపారు. నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతం పలికారు. ఆయన మరికాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరిగి హైదరాబాద్ బయలుదేరి వెళ్లనున్నారు.
Next Story