Mon Dec 15 2025 03:53:53 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : నేడు తెలంగాణ, ఏపీలలో మోదీ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు

ప్రధాని నరేంద్ర మోదీ నేడు మరోసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి రానున్నారు. హైదాబాద్ నుంచి తొలుత తెలంగాణలోని వేములవాడకు చేరుకుంటారు. అక్కడ రాజరాజేశ్వరి స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేములవాడ బాలానగర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి వరంగల్ సభకు చేరుకుంటారు. అక్కడ ప్రసంగించిన అనంతరం తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకుంటారు.
విజయవాడలో రోడ్ షో...
హైదరాబాద్ నుంచి నేరుగా తిరుపతికి చేరుకుంటారు. మధ్యమహ్నం 2.55 గంటలకు తిరుపతికి చేరుకుని అక్కడి నుంచి 3.45 గంటలకు రాజంపేట లోక్సభ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిరికి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం సాయంత్రం 6.25 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ చేరుకుంటారు. ఇందిరాగాంధఈ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకూ జరిగే రోడ్ షోలో పాల్గొంటారు.
Next Story

