Mon Dec 23 2024 01:15:54 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : 26న మోదీ తిరుమల పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన తిరుమలకు రానున్నారు. 27న శ్రీవారిని దర్శించుకోనున్నారు
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 26వ తేదీన తిరుమలకు రానున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారం నుంచి ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రానున్నారు. ఈ మేరకు ప్రధాని తిరుమల షెడ్యూల్ విడుదలయింది. 26వ తేదీ సాయంత్రం 5.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి తిరుమలకు చేరుకుంటారు. 26వ తేదీ రాత్రి తిరుమలలోనే ప్రధాని నరేంద్ర మోదీ బస చేయనున్నారు. 27వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి దర్శనం చేసుకుంటారు.
తిరుపతి నుంచి...
స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం తిరపతి నుంచి బయలుదేరి 27వ తేదీన మహబూబాాద్, కరీంనగర్ లలో జరిగే బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చి అక్కడ రోడ్ షోలో మోదీ ప్రచారాన్ని నిర్వహిస్తారు. షో అనంతరం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ నెల 28వ తేదీతో ప్రచారం ముగుస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇటు ఎన్నికల ప్రచారంతో పాటు అటు శ్రీవారి దర్శనం కూడా చేసుకోనున్నారు.
Next Story