Sun Mar 30 2025 13:39:06 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : మోదీ విశాఖ పర్యటన రద్దు
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయింది. ఈ నెల 29న నరేంద్ర మోదీ విశాఖకు రావాల్సి ఉంది.

ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయింది. ఈ నెల 29న నరేంద్ర మోదీ విశాఖకు రావాల్సి ఉంది. అయితే ఏపీకి తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆయనను పర్యటనను ప్రధాన మంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో లక్ష మందితో భారీ బహిరంగ సభను నిర్వహించాలని భావించారు.
రైల్వే ప్రాజెక్టుల ప్రారంభం...
అక్కడ నుంచి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతోపాటు కొన్ని రైల్వై ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. జాతీయ రహదారులను కూడా జాతికి అంకితం చేయాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాలను వర్చువల్ పద్ధతిలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశాలున్నాయి. విశాఖ పర్యటనను మాత్రం రద్దు చేస్తున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది.
Next Story