మాజీ మంత్రి నారాయణపై.. ఆ కేసు పెట్టిన ఆయన తమ్ముడి భార్య
మాజీమంత్రి టీడీపీ నాయకుడు నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం
మాజీమంత్రి టీడీపీ నాయకుడు నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో పొంగూరు కృష్ణప్రియ క్రిమినల్ కంప్లైంట్ దాఖలు చేసింది. నారాయణ తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ అతని తమ్ముడి భార్య పొంగూరు కృష్ణప్రియ మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన వీడియో.. నెట్టింట వైరల్‌గా మారడంతో తీవ్ర సంచలనం రేగింది. దీంతో వెంటనే నారాయణ తమ్ముడు సుబ్రహ్మణ్యం స్పందిస్తూ.. తన భార్య మానసిక పరిస్థితి బాగోలేక పోవడం వల్లనే తన అన్నం నారాయణ మీద ఆరోపణలు చేస్తూ వీడియో చేసిందని చెప్తూ ఒక వీడియో విడుదల చేశాడు.
అయితే తన భర్త తన మీద చేసిన వ్యాఖ్యలకు స్పందించిన కృష్ణప్రియ.. మాజీ మంత్రి నారాయణ, తన భర్త సుబ్రహ్మణ్యం తనను వేధిస్తూ, బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ పొంగూరు ప్రియ రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. భర్త విడుదల చేసిన వీడియోను చూసిన భార్య కృష్ణప్రియ వెంటనే రాయదుర్గం పోలీస్ స్టేషన్లో తన భర్త, నారాయణ మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నా తమ్ములిద్దరు కలిసి తనను వేధిస్తూ.. బెదిరింపు లకు పాల్పడుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇలా నవ్వుతూ మాట్లాడుతున్నందుకు అందరికీ అనుమానం వస్తుంది. కానీ నిజంగానే నారాయణ తనను వేధింపు లకు గురి చేసేవాడని ఆవేదన వ్యక్తం చేసింది.
తన భర్త ఈ విధంగా మాట్లాడటం వల్లనే తాను ఇంతవరకు నారాయణ మీద కంప్లైంట్ చేయలేదంటూ కృష్ణప్రియ ఆవేదన వ్యక్తం చేస్తూ మరో వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వచ్చే 2024 ఎన్నికల్లో నెల్లూరు నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసేందుకు నారాయణ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ తాజా వివాదం ఆయన రాజకీయ అవకాశాలపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. నారాయణ పరువును, టీడీపీ అవకాశాలను దెబ్బతీసేందుకు వైసీపీ ఈ వివాదం రచిస్తోందని కొందరు విమర్శిస్తుండగా, ఆర్థిక అంచనాల కారణంగా బయటపడ్డ కుటుంబ అంతర్గత వ్యవహారం కావచ్చునని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితి వెనుక ఉన్న వాస్తవాన్ని కాలమే వెల్లడిస్తుంది.