Fri Dec 20 2024 05:37:54 GMT+0000 (Coordinated Universal Time)
Liquor Shops : ఏపీలో మద్యం దుకాణాల లైసెన్స్ ఫీజు ఆదాయం ఇప్పటి వరకూ ఎంతంటే?
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల ప్రక్రియ నాలుగు రోజుల క్రితం ప్రారంభమయింది.
ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తుల ప్రక్రియ నాలుగు రోజుల క్రితం ప్రారంభమయింది. అయితే పెద్దగా స్పందన ఈ మూడు రోజుల్లో రావడం లేదు. అయితే ఇందుకు ప్రధాన కారణం టీడీపీ స్థానిక నేతలు కుమ్మక్కై ఎక్కువ మంది లైసెన్స్ ఫీజు కట్టకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3,736 వైన్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 10 శాతం అంటే రాష్ట్ర వ్యాప్తంగా 340 దుకాణాలను గీత కార్మికులకు కేటాయించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ లైసెన్స్ ఫీజును ఒకవేళ మద్యం దుకాణాలు దక్కకపోతే తిరిగి చెల్లించే అవకాశంలేదు.
లైెసెన్స్ ఫీజును...
మద్యం దుకాణాల లైసెన్స్ పొందేందుకు ఒక వ్యక్తి ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. పది వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు, 50వేల జనాభా ఉంటే లోపు ఉంటే 55 లక్షల రూపాయలు, ఐదు లక్షలలోపు ఉంటే 65 లక్షల రూపాయలు, ఐదు లక్షలకు పైన జనాభా ఉంటే 85 లక్షల రూపాయల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు నేరుగా లిక్కర్ బిజినెస్ లోకి దిగారు. తమ సానుభూతి పరులకు దుకాణాలు దక్కేలా అనేక చోట్ల ఎమ్మెల్యేలు వత్తిడి తెచ్చి ఎక్కువ మంది దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
మూడు రోజుల్లో అరవై కోట్లు...
అయితే ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మద్యం దుకాణాలకు మూడు రోజుల్లో కేవలం మూడు వేల దరఖాస్తులు మాత్రమే రావడం ఇందుకు నిదర్శనమంటున్నారు. ఈ నెల 9వ తేదీ వరకూ దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉంది. అంటే మరో ఐదు రోజుల సమయం ఉంది. లాటరీ పద్దతిలో మద్యం దుకాణాలను కేటాయించనుండటంతో ఎక్కువ మంది పాల్పడకుండా సిండికేట్ అయి తక్కువ మంది ఒక్కొక్క మద్యం దుకాణానికి లైసెన్స్ ఫీజు చెల్లిస్తున్నట్లు, వారు కూడా బినామీలతో చేయిస్తున్నట్లు కూడా అనుమానాలున్నాయి. ఇప్పటివరకూ లైసెన్స్ ఫీజు ద్వారా అరవై కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే ప్రభుత్వానికి లభించింది. దీంతో మద్యం నుంచి ప్రభుత్వం ఆశించినంత లిక్కర్ లైసెన్స్ ఫీజుల రూపంలో వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేసింది.
Next Story