Mon Dec 23 2024 12:38:14 GMT+0000 (Coordinated Universal Time)
మెగా DSC 2024 టెస్ట్ అప్డేట్ ఇదే
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీకి సంబంధించిన ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం కానుంది
ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీకి సంబంధించిన ప్రక్రియ వచ్చేనెలలో ప్రారంభం కానుంది. నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రక్రియ వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైలుపై సంతకం చేసిన సంగతి తెలిసిందే.
నోటిఫికేషన్ కు...
దీనికి సంబంధించిన ప్రక్రియ నవంబరు 6వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 16, 347 ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు నవంబర్ 6 న ఉత్తర్వులు జారీ చేయనున్నారు. అక్టోబర్ 3 నుండి 21 వరకు టెట్ పరీక్షలను నిర్వహించారు. పరీక్షల తుది కీ ఈ నెల 29 నుండి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచింది. నవంబర్ 2 న ఫలితాలు విడుదల చేయనుంది. 6 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
Next Story