Sun Dec 22 2024 23:06:40 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ సాహితీవేత్త ఎండ్లూరి సుధాకర్ మృతి
"అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త
ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో గుండెపోటుతో మృతిచెందారు. 1959, జనవరి 21వ తేదీన నిజామాబాద్ లోని పాములబస్తీలో జన్మించిన ఎండ్లూరి సుధాకర్.. రాజమండ్రిలోని తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా 28 సంవత్సరాలు పనిచేశారు. అలాగే కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడిగా, తెలుగు అకాడమీ సభ్యుడిగా, పలు హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగానూ వ్యవహరించారు.
Also Read : కరోనా కొత్తవేరియంట్.. ప్రతి ముగ్గురిలో ఒకరు మృతి
ఎండ్లూరి సుధాకర్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. "అభ్యుదయ స్ఫూర్తినిచ్చే రచనలతో తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి మరణం విచారకరం. సుధాకర్ మృతి తెలుగు సాహితీ లోకానికే కాదు, దళిత సమాజానికి కూడా తీరని లోటు. తెలుగు ఆచార్యునిగా ఎందరో విద్యార్థులు, పరిశోధకులకు మార్గనిర్థేశం చేసిన ఎండ్లూరి సుధాకర్ గారి ఆత్మశాంతికై భగవంతుని ప్రార్ధిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను." అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. అలాగే నారా లోకేష్ కూడా సుధాకర్ మృతి పట్ల సంతాపం తెలిపారు.
Next Story