Mon Dec 16 2024 18:39:34 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు వినపడేలా...మోత మోగించేశారుగా
చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంటా పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగ పార్టీ ఇచ్చిన నిరసన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాష్ట్రంలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. సరిగ్గా ఏడుగంటల నుంచి ఏడు గంటల ఐదు నిమిషాల వరకూ గంట మోగించి తమ నిరసనను తెలియచేశారు.
బ్రాహ్మణి ఇక్కడ.. లోకేష్ అక్కడ...
రాజమండ్రిలోని క్యాంప్ కార్యాలయంలో నారా బ్రాహ్మణి, ఢిల్లీలో నారా లోకేష్ లు గంట మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పార్టీ కార్యాలయాల్లోనూ, పార్టీ అభిమానులు తమ ఇళ్ల వద్ద పళ్లేలను మోగించి తమ నిరసనను తెలియజేశారు. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసిి రాజమండ్రి జైలులో పెట్టారని టీడీపీ ఆరోపిస్తుంది. చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లి ఇరవై రోజులు కావస్తుంది. ఈ సందర్బంగా టీడీపీ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
Next Story