పోరాటాలతో విశాఖ ఉక్కును రక్షించుకుందాం
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1000 రోజులకు
32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కానివ్వమని గాజువాక నియోజక వర్గం ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. కూర్మన్నపాలెం కూడలిలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చేపట్టిన రిలే దీక్షలు బుధవారం నాటికి 1000 రోజులకు చేరుకున్నాయి. పోరాట కమిటీ చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, సి.హెచ్.నర్శింగరావు 1000 రోజుల నిరసన దీక్షా శిబిరానికి అధ్యక్షత వహించగా, ఈ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్స్ సంఘీభావం తెలిపారు. శాసనసభ, శాసనమండలి సభ్యులు, రాష్ట్రం లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ట్రేడ్ యూనియన్ లకు చెందిన నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో సముద్ర తీరంలోని ఏకైక కర్మాగారం విశాఖ ఉక్కు అని అన్నారు. ఈ కర్మాగారం ప్రాణ త్యాగాలతో ఏర్పాటైనదని , ఇలాంటి కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం తన అనునాయకులకు కట్టబెడితే ఊరుకోబోమని అన్నారు.