Mon Dec 23 2024 05:52:23 GMT+0000 (Coordinated Universal Time)
నేడు యానాంకు తమిళి సై
యానాంలో నేడు పాండిచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళి సై పర్యటించనున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు
యానాంలో నేడు పాండిచ్చేరి లెఫ్ట్నెంట్ గవర్నర్ తమిళి సై పర్యటించనున్నారు. వరద ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకోనున్నారు. మరికాసేపట్లో రాజమండ్రి ఎయిర్పోర్టుకు చేరుకోనున్న తమిళి సై అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా యానాం బయలు దేరి వెళతారు. అక్కడ వరద పరిస్థతిని సమీక్షిస్తారు. వరద బాధితులతో మాట్లాడతారు.
వరద బాధితులతో...
వరద బాధితులకు ప్రభుత్వం ఐదు వేల రూపాయల చొప్పున సాయం ప్రకటించింది. వాటిని కూడా పంపిణీ చేయనున్నారు. గోదావరి వరదతో యానాం వరద నీటిలో మునిగిపోయింది. 4,400 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. వారితో తమిళి సై మాట్లాడతారు. వారికి అందుతున్న సాయం గురించి వివరాలు తెలుసుకుంటారు. గవర్నర్ పర్యటన కోసం అధికారులు ీఅన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Next Story