Mon Dec 16 2024 11:44:42 GMT+0000 (Coordinated Universal Time)
TDP : మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచో చెప్పిన టీడీపీ నేత
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి అన్నారు. మూడు నెలల బకాయిలతో కలిపి పెంచిన పెన్షన్లు పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు.ఈ విధంగా భారత దేశంలో ఎక్కడ అమలు చేయలేదని చర్చించుకుంటున్నారని, మంచానికే పరిమితమైన పెన్షన్ దారులు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. పింఛన్లను సృష్టించింది టీడీపీ మాత్రమేనని అన్నారు.
రెండు, మూడు నెలల్లో...
ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్లు ఒంటి హామీల అన్నిటినీ రెండు, మూడు నెలలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లెలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో అస్తవ్యస్తం చేశారని,పులివెందుల కౌన్సిలర్లు బిల్లులు రావాలని గగ్గోలు పెడుతున్నారన్నారు. గతంలో వైఎస్ జగన్ నీరు చెట్టు బిల్లులన్నీ పెండింగ్ పెట్టారని, తాము కూడా గతంలో పనులు చేశాము వాటికి కూడా ఇవ్వలేదని, చేసిన వాటిల్లో కొన్ని దొంగ బిల్లులు ఉండొచ్చు కానీ చేసిన వాటికైనా బిల్లులు ఇవ్వాలి కదా పులివెందుల అభివృద్ధి పనుల విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని ఆయన తెలిపారు.
Next Story