Wed Apr 09 2025 04:17:29 GMT+0000 (Coordinated Universal Time)
రానున్నది రామరాజ్యమే : బీటెక్ రవి
రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమే పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి అని అన్నారు.

రాష్ట్రంలో రానున్నది రామరాజ్యమే పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి అని అన్నారు. కులం చూడమని, మతం చూడమని చెప్పి అధికారంలోకి వచ్చి కులం మతం చూసే పథకాలను లబ్ధిదారులు ఎంపిక చేస్తున్న దుర్మార్గుడు జగన్ అని బీటెక్ రవి అన్నారు. మోసానికి మాయకి అక్రమాలకు అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారు అంటే అది వైసీపీ అని ఆయన మండిపడ్డారు.
అరాచక పాలనకు...
జగన్ మోహన్ రెడ్డి అవినీతి అరాచక పాలనకు చరమగీతం పాడాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనించాలంటే ప్రజలకు మంచి జరగాలంటే టిడిపి కూటమిని ప్రజలు ఆదరించాలన్నారు. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్న బీటెక్ రవి ఈ వ్యాఖ్యలు చేశారు.
Next Story