Fri Nov 15 2024 19:39:01 GMT+0000 (Coordinated Universal Time)
నేడు తేలనుందా?
స్కిల్ డెవలెప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది
స్కిల్ డెవలెప్మెంట్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. ఈ కేసులో తనపై నమోదయిన కేసులన్నీ కొట్టివేయాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు క్వాష్ పిటీషన్ ను కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు వెళ్లక తప్పింది కాదు. అయితే దీనిపై నిన్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఎదుట ఈ విషయాన్ని చంద్రబాబు తరుపున న్యాయవాదులు ప్రస్తావించారు.
ఈరోజు లిస్ట్....
దీనిపై ఈరోజు లిస్ట్ చేస్తామని సీజే చెప్పారు. చంద్రబాబు రిమాండ్ కు వెళ్లింది ఎన్ని రోజులయిందని ఆయన ప్రశ్నించారు. ఈరోజు కేసును లిస్ట్ చేస్తామని చెప్పారు. దీంతో ఈ కేసును ఎప్పుడు విచారించాలన్నది నేడు నిర్ణయిస్తామని తెలిపారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటీషన్ ఎప్పుడు లిస్ట్ అవుతుందన్న విషయంపై నేడు స్పష్టమవుతుంది. దీంతో ఈ నెల 28వ తేదీలోపు లిస్ట్ అవుతుందా? లేదా? అన్న టెన్షన్ నెలకొంది. సుప్రీంకోర్టుకు వరస సెలవులు ఉండటంతో చంద్రబాబు తరుపున న్యాయవాదుల్లోనూ ఆందోళన నెలకొంది.
Next Story