Sat Feb 15 2025 07:03:33 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షాకు రఘురామ ఫిర్యాదు
రైతుల పాదయాత్ర పై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రాఘరామ కృష్ణరాజు లేఖ రాశారు.
![అమిత్ షాకు రఘురామ ఫిర్యాదు అమిత్ షాకు రఘురామ ఫిర్యాదు](https://www.telugupost.com/h-upload/2022/09/18/1416240-raghu-rama-krishna-raju.webp)
రైతుల పాదయాత్ర పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు నరసాపురం పార్లమెంటు సభ్యుడు రాఘరామ కృష్ణరాజు లేఖ రాశారు. పాదయాత్రకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని రాఘరామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు.
రెచ్చగొట్టేలా...
పాదయాత్రకు ఆటంకం కలిగించేలా మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. రైతులు తమ పాదయాత్రను శాంతియుతంగా చేస్తున్నా అలజడి సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు అనుమానం కలుగుతుందని రాఘరామ కృష్ణరాజు లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని ఆయన కోరారు.
Next Story