Sun Dec 22 2024 22:08:12 GMT+0000 (Coordinated Universal Time)
ఆరోగ్యం బాగా లేదన్నావుగా.. దీక్షలు దేనికో?
ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు నిరాహార దీక్ష చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు మద్దతుగా ఆయన ఈ దీక్ష చేయనున్నారు.
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు నిరాహార దీక్ష చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగులకు మద్దతుగా ఆయన ఈ దీక్ష చేయనున్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ దీక్ష చేస్తానని రఘురామ కృష్ణరాజు వెల్లడించారు. ప్రభుత్వోద్యోగులకు, పించన్ దారులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు.
సీఐడీ విచారణకు...
పీఆర్సీ, ఫిట్ మెంట్, హెచ్ఆర్ఏ విషయంలో ఉద్యోగులను వంచించిందని అన్నారు. అందుకోసమే తాను ఒకరోజు ఉపవాస దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ సీఐడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు రఘురామ కృష్ణరాజు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈనెల 17వ తేదీన సీఐడీ అధికారుల విచారణకు రఘురామ కృష్ణరాజు హాజరు కావాల్సి ఉంది. అయితే తనకు అనారోగ్యంగా ఉందని, నాలుగు వారాల పాటు తనకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనదీక్ష చేయడానికి మాత్రం ఆరోగ్యం సహకరిస్తుందా? అన్న సెటైర్లు విన్పిస్తున్నాయి.
Next Story