Mon Dec 23 2024 13:35:12 GMT+0000 (Coordinated Universal Time)
వివేకాను హత్య చేసింది అందుకు కాకపోవచ్చు
వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి వాంగ్మూలం తప్పుదోవ పట్టించే విధంగా ఉందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. భూ వివాదాల వల్లనే వైఎస్ వివేకా హత్య జరిగినట్లు దస్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోందని, ఇది కేసును తప్పుదోవ పట్టించడానికేనన్నది అర్థమవుతుందని రఘురామ కృష్ణరాజు అన్నారు. బెంగళూరు భూ వివాదానికి, వైెస్ వివేకా హత్యకు ముడిపెడుతున్నారని ఆయన అన్నారు.
8 కోట్ల భూ వివాదానికి 40 కోట్ల సుపారీయా?
ఇది కరెక్ట్ కాదని, నిజాలు బయటకు తీసుకు రావాల్సిన బాధ్యత సీబీఐదేనని రఘురామ కృష్ణరాజు అభిప్రాయపడ్డారు. ఈ కేసులో సీీబీఐ మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. 8 కోట్ల భూవివాదంలో 40 కోట్ల సుపారీని ఎర్రగంగిరెడ్డి ఎలా ఇస్తారని రఘురామ కృష్ణరాజు ప్రశ్నించారు. ఈ హత్య వెనక అసలు నిందితులు ఎవరో బయటకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story