Mon Dec 23 2024 16:59:49 GMT+0000 (Coordinated Universal Time)
Kurnool : కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. మీసాలు, గడ్డాలు తీయాలంటూ?
కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారు
కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ తో పాటు అధ్యాపకులు కూడా అనేక దఫాలు కౌన్సెలింగ్ చేసినా ర్యాగింగ్ మాత్రం ఆగడం లేదు. ఇటీవల ప్రిన్సిపల్ యాంటీ ర్యాగింగ్ పై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ర్యాగింగ్ కు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
తాము చెప్పిన కళ్లజోళ్లను...
అయినా సరే జూనియర్ విద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మీసాలు, గడ్డాలు తీసేయాలంటూ విద్యార్థులపై వత్తిడి తెస్తున్నారని జూనియర్ విద్యార్థులు చెబుతున్నారు. తాము ఇచ్చిన, చెప్పిన కళ్లజోళ్లు ధరించాలంటూ హుకుం జారీ చేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కళాశాల ప్రిన్సిపల్ మరోసారి సీనియర్ విద్యార్థులకు క్లాస్ పీకేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఎవరిపై ఇంత వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
Next Story