Thu Dec 26 2024 09:45:36 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో వంద కిలోమీటర్లే
ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. ఏపీలో వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది
ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ భారత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. ఏపీలో వంద కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగుతుంది. నిన్న ఏపీలోకి ప్రవేశించిన యాత్ర నాలుగు రోజులు తర్వాత తిరిగి కర్ణాటకకు చేరుకుంటుంది. అక్కడి నుంచి ఈ నెల 23వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించనుంది. రాహుల్ పాదయాత్ర అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మాత్రమే కొనసాగుతుంది. పాదయాత్రకు ఏపీ కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు.
జోడో యాత్ర...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా లేదు. రెండు సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కనీస పనితీరును కనపర్చలేదు. క్యాడర్ కూడా కకావికలమయింది. అయితే ఈసారి కూడా ఏపీలో కాంగ్రెస్ కు పెద్దగా ప్రయోజనం లేదని భావించిన పార్టీ పెద్దలు కేవలం నాలుగు రోజుల యాత్రకే పరిమితం చేశారంటున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లకు చేరుకుంది. గత నెల 7వ తేదీన కన్యాకుమారిలో ప్రారంభమయిన రాహుల్ పాదయాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక లో కొనసాగింది.
Next Story