Sat Dec 21 2024 02:53:59 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో ముగిసిన రాహుల్ యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో ముగిసింది. మంత్రాలయం నుంచి ప్రారంభమయిన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో ముగిసింది. ఉదయం మంత్రాలయం టెంపుల్ సర్కిల్ నుంచి ప్రారంభమయిన యాత్ర కర్ణాటకలోకి ప్రవేశించింది. కర్ణాటకలో రెండు రోజుల పాటు సాగనుంది. ఆంధ్రప్రదేశ్ లో రాహుల్ పాదయాత్ర నాలుగు రోజుల పాటు సాగింది. మొత్తం 100 కిలో మీటర్లకు పైగా రాహుల్ నడక సాగించారు. ఆంధ్రప్రదేశ్ లోనూ రాహుల్ యాత్రకు అపూర్వ స్పందన లభించింది.
కనిపించని నేతలు...
ఇప్పటి వరకూ పార్టీలో కన్పించని నేతలు కూడా రాహుల్ పాదయాత్రలో కన్పించారు. మాజీ కేంద్ర మంత్రి పళ్లంరాజు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి సయితం రాహుల్ ను కలిసి పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. రాహుల్ ను చూసేందుకు వేలాది మంది జనం ఆయన పాదయాత్ర వద్దకు వచ్చారు. ముఖ్యంగా యువత ఆయనతో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపింది. ఏపీలో రాహుల్ యాత్ర సక్సెస్ అయిందనే చెప్పాలి. కర్ణాటకలో రెండు రోజలు పాదయాత్ర కొనసాగిన అనంతరం ఈ నెల 23వ తేదీన తెలంగాణలోకి యాత్ర ప్రవేశిస్తుంది.
Next Story